సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 19:19:45

లాక్‌డౌన్‌లో డెలివరీ..పాప పేరు కరోనా.. బాబు పేరు కొవిడ్‌

లాక్‌డౌన్‌లో డెలివరీ..పాప పేరు కరోనా.. బాబు పేరు కొవిడ్‌

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది 'కోవిడ్',  'కరోనా' అనే పదాలను చూసి భయపడుతున్నారు. కానీ చత్తీస్‌గఢ్‌కు చెందిన వీరు మాత్రం తమ నవజాత కవలలకు ఆ పేర్లే పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఎందుకో తెలుసా? దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. కానీ వినయ్ వర్మ భార్య ప్రీతి మాత్రం పురిటినొప్పులతో ఉంది. వెంటనే డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు వినయ్‌ వర్మ. అక్కడ ఆమె ఒక అబ్బాయి,  అమ్మాయికి జన్మనిచ్చింది. డాక్టర్లు ప్రితీకి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేశారు. తల్లి, నవజాత శిశువులు ఇద్దరూ బాగానే ఉన్నారు. శిశువుల బరువు 2.9 కిలోలు, 2.7 కిలోలు.   మేము ఉద్రిక్తమైన పరిస్థితుల మధ్య ఆస్పత్రికి వచ్చాం. నా భర్త నన్ను మోటారుసైకిల్‌పై ఆసుపత్రికి తీసుకొచ్చారు. వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు ఎన్నో చెక్ పాయింట్ల వద్ద మమ్మల్ని ఆపేశారు’ అని రాయ్‌పూర్‌లోని పురాణి బస్తీ నివాసి ప్రీతి ప్రసవం తర్వాత చెప్పారు.

‘కొవిడ్‌19కి సంబంధించి ఈ రోజుల్లో చాలా భయాలున్నాయి. ఈ పదాలతో ముడిపడి ఉన్న ఆందోళన, భయాన్ని తగ్గించాలని మేం అనుకున్నాం. ఈ సందర్భాన్ని చిరస్మరణీయంగా మార్చాలని కోరుకున్నాం. అందుకే, నేను, నా భర్త మా కవలలకు కోవిడ్ (అబ్బాయి), కరోనా (అమ్మాయి) అని పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం ” అని చిరునవ్వుతో చెప్పింది ప్రీతి.  ‘పురుటి నొప్పులు, లాక్‌డౌన్‌, ఆపిన పోలీసులు, బైక్‌పై ప్రయాణం, తట్టుకోలేని నొప్పి, సిజేరియన్‌ ఆపరేషన్‌, లాక్‌డౌన్‌ వల్ల ఆస్పత్రికి రాని బంధువులు.. వీటన్నింటి మధ్య ఒక ఆనందం.. మాకు కవల పిల్లలు పుట్టారు. అందుకే ఈ కరోనా సమయాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే మా పిల్లలకు జీవితాంతం గుర్తండేలా ఈ పేర్లు పెట్టాలనుకుంటున్నాం’ అని సంతోషంగా చెప్పారు వినయ్‌వర్మ, ప్రితీ. 


logo