బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 17:46:18

చెఫ్ గా ఏడాది చిన్నారి..వీడియోలు వైర‌ల్

చెఫ్ గా ఏడాది చిన్నారి..వీడియోలు వైర‌ల్

క్యూట్ గా ముద్దుచ్చేలా ఉన్న ఈ బుజ్జి పాపాయి వ‌యస్సు ఏడాది‌. అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటూ ఉండాలి. క్వారంటైన్ లో అంద‌రూ తమ పాక శాస్త్ర నైపుణ్యానికి ప‌దునుపెడుతున్న విష‌యం తెలిసిందే. వారంద‌రికీ నేనేమి త‌క్కువ కాద‌ని నిరూపిస్తోంది చిన్నారి కొబె. చెఫ్ లా డ్రెస్ వేసుకుని అమ్మా, నాన్న‌తో క‌లిసి ర‌క‌ర‌కాల వంట‌కాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ట.

వెగాన్ బ‌నానా చాకోలేట్ చిప్ బార్స్ కూడా చేసింద‌ట కొబె‌. కిచెన్ లో చిన్నారి సంద‌డి చేసిన వీడియోలు కొబే ఈట్స్ పేరుతో ఉన్న‌ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయ‌గా.. నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.


logo