శనివారం 11 జూలై 2020
National - Jun 25, 2020 , 17:31:32

జారుడుబ‌ల్ల ఆట‌లో బిజీగా ఉన్న గున్న ఏనుగు!

జారుడుబ‌ల్ల ఆట‌లో బిజీగా ఉన్న గున్న ఏనుగు!

పిల్ల‌ల‌కు అత్యంత ఇష్ట‌మైన ఆట‌ల‌లో జారుడుబ‌ల్ల ఒక‌టి. పిల్ల‌లు ఆడుతున్న‌ప్పుడు చూస్తే ఎవ‌రికైనా బాల్యంలో చేసిన అల్ల‌రు గుర్తుకురావ‌డం సహ‌జం. కొంత‌మంది అయితే పిల్ల‌ల్ని పక్క‌కు నెట్టి వారు కూడా జారుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇది మ‌నుషుల‌కే ప‌రిమితం కాదు. మ‌నుషులు అయినా జంతువులు అయినా పిల్ల‌లు పిల్ల‌లే. ఎవ‌రి ఎంజాయ్‌మెంట్ వారికి ఉంటుంది.

ఇటీవ‌ల ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద ట్విట‌ర్‌లో షేర్ చేసిన వీడియో గురించే ఇదంతా. అందులో ఒక గున్న ఏనుగు పై నుంచి కింద‌కి జారుతుంది. మ‌ర‌లా పైకి వెళ్లి మ‌ళ్ళీ జారుతుంది. ప్ర‌కృతిని ఎంజాయ్ చేసేవారు ఆడుకోవ‌డానికి ఎలాంటి ప‌రిక‌రాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తిదాన్ని అవ‌స‌రానికి మార్చుకుంటూ ఉంటారు. ఈ వీడియో ట్విట‌ర్‌లో వైర‌ల్ అవుతుంది. జారుగు ఆట‌ను ఎంజాయ్ చేయ‌డం చిన్న‌పిల్ల‌ల జీన్స్‌లోనే ఉంటుందని ఒక‌రు కామెంట్ పెడితే.. వ‌చ్చే జ‌న్మ‌లో తాను ఏనుగై పుట్టాల‌నుకుంటున్న‌ట్లు మ‌రో నెటిజ‌న్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


logo