శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 12, 2020 , 13:11:38

అంద‌రూ బంతితో ఆడుకుంటుంటే.. ఈ ఏనుగు మాత్రం అర‌టిగెల‌తో ఫుట్‌బాల్ ఆడేస్తుంది!

అంద‌రూ బంతితో ఆడుకుంటుంటే.. ఈ ఏనుగు మాత్రం అర‌టిగెల‌తో ఫుట్‌బాల్ ఆడేస్తుంది!

చిన్న ఏనుగులు భ‌లే అందంగా ఉంటాయి. వీటి వీడియోల‌తో ట్విట‌ర్ నిండిపోతున్న‌ది. ప్ర‌తిరోజూ జంతువుల‌కు సంబంధించిన వీడియోల‌ను చూడందే నెటిజ‌న్ల రోజు మొద‌ల‌వ్వదు. అర‌టిపండుతో ఆడుతున్న చిన్న ఏనుగు వైర‌ల్ వీడియోనే దీనికి నిద‌ర్శ‌నం. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో పిల్ల ఏనుగులు, త‌ల్లి ఏనుగులున్నాయి. చిన్న‌ది అర‌టి కొమ్మ‌ల‌తో ఆడుకుంటున్న‌ట్లు వీడియోలో చూడొచ్చు.

తొండంతో అర‌టి గెల‌ల‌ను ఫుట్‌బాల్ ఆడిన‌ట్లు ఆడేస్తున్న‌ది. ఆడిన త‌ర్వ‌త మ‌ళ్లీ త‌ల్లి ఏనుగు వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లింది. ఈ క్లిప్‌ను నెటిజ‌న్లు ఇష్ట‌ప‌డుతున్నారు. 'బేబీ ఏనుగులు ఎప్పుడూ చూడ‌డానికి చాలా ఆనందంగా ఉంటాయి' అని ఒక నెటిజ‌న్ కామెంట్ పెట్టారు. ప్ర‌పంచ ఏనుగు దినోత్స‌వానికి ఒక‌రోజు ముందు నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను 35 కే మంది వీక్షించారు.