శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 05, 2020 , 12:57:29

చిన్న పిల్ల‌ల్లా ఇసుక‌లో ఆడుకుంటున్న ఏనుగు.. తాను కూడా చిన్న‌పిల్లే!

చిన్న పిల్ల‌ల్లా ఇసుక‌లో ఆడుకుంటున్న ఏనుగు.. తాను కూడా చిన్న‌పిల్లే!

చిన్న‌పిల్ల‌ల‌కు ఇసుక క‌నిపిస్తే కాళ్లు ఆగ‌వు, చేతులు ఊరుకోవు. అమాంతం దాని మీదకు దూకి ఇసుక‌తో ఇల్లు క‌ట్టేస్తారు. ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటారు గాని అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు రారు. అంత ఇష్టం ఇసుకంటే.. ఇలా చేయ‌డం మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కూ ఇష్ట‌మే. కావాలంటే మీరే చూడండి. భారీ ఆకారంలో ఉండే ఏనుగు కూడా ఇసుక‌తో ఎలా ఆడుకుంటుందో.

16 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు. వీడియోలో చూసిన‌ట్లైతే బేబీ ఏనుగు త‌న రెండు కాళ్ల‌తో ఇసుక‌ను తొక్కుతున్న‌ది. ఆ స‌మ‌యంలో ఏనుగు ఎంత సంతోషంగా ఉందో మాట‌ల్లో చెప్ప‌లేం. 'ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం కంటే ఏనుగు ముఖంపై సంతృప్తి మంచిది' అనే శీర్షిక‌ను జోడించారు. ఈ వీడియోను మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేయండి.