బుధవారం 08 జూలై 2020
National - Mar 06, 2020 , 18:07:41

గజరాజునే భయపెట్టిన బర్రెదూడ..వీడియో వైరల్‌

గజరాజునే భయపెట్టిన బర్రెదూడ..వీడియో వైరల్‌

ఒరెయ్‌.. ఒరెయ్‌..ఒరెయ్‌.. ఆగరా... గజరాజునే భయపెడుతవా?... రోజు రోజుకు నీ అల్లరి ఎక్కువైతుంది. అంటూ ఎనుగుతో సరదా ఆటలాడుతున్న బుజ్జి బర్రెదూడ వెనకాల తల్లి బర్రె ఎలా పరుగుడుతుందో చూడండి. ఏనుగు కూడా దాన్ని ఏమనాలో తెలియక భయపడుతున్నట్లు నటిస్తూ రివర్స్‌ రన్నింగ్‌ ఎలా చేస్తున్నదో చూడండి. ఈ  హుషారైన దూడ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.  17 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. సోషల్‌మీడియాలో ఈ వీడియోకు 1.2 లక్షల వ్యూస్‌ రాగా..9000 లైక్స్‌ వచ్చాయి. 


logo