శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 09:19:00

త‌ల్లి గ‌ర్భంలోనే శిశువుకు సోకిన క‌రోనా!

త‌ల్లి గ‌ర్భంలోనే శిశువుకు సోకిన క‌రోనా!

న్యూఢిల్లీ : త‌ల్లి గ‌ర్భంలోనే శిశువుకు క‌రోనా సోకింది. ఆ గ‌ర్భిణికి మొద‌ట క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కానీ డెలివ‌రీ మాత్రం నెగిటివ్ ఫ‌లితం వ‌చ్చాకే అయింది. పుట్టిన ఆరు గంట‌ల త‌ర్వాత బిడ్డ‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ ఫ‌లితం వ‌చ్చింది. ఇలాంటి కేసు దేశంలోనే మొద‌టిసారి అని ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. 

నంగ్లోయికి చెందిన 25 ఏళ్ల మ‌హిళ గ‌ర్భిణి. ఆమెకు జూన్ 11న క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. భ‌ర్త కూడా క‌రోనా రావ‌డంతో చికిత్స పొందుతున్నాడు. రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గ‌ర్భిణికి జూన్ 25న మ‌ళ్లీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఫ‌లితం పాజిటివ్ వ‌చ్చింది. మ‌ళ్లీ జులై 7వ తేదీన ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఆ మ‌రుస‌టి రోజే పండంటి బిడ్డ‌కు గ‌ర్భిణి జ‌న్మ‌నిచ్చింది. బిడ్డ పుట్టిన ఆరు గంట‌ల త‌ర్వాత‌.. చిన్నారి న‌మూనాల‌ను సేక‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. చిన్నారికి క‌రోనా ఇన్ ఫెక్ష‌న్ అధికంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. త‌ల్లి బొడ్డుతాడు నుంచి బిడ్డ‌కు క‌రోనా వ్యాపించే అవ‌కాశం ఉంద‌ని రామ్ మ‌నోహ‌ర్ లోహియా వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతానికి చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. 


logo