బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 20:01:04

అమిత్‌షాను కలిశా..సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్తున్నా!

అమిత్‌షాను కలిశా..సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్తున్నా!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ప్రజాప్రతినిధులు, మంత్రులు,సెలబ్రిటీలు  కరోనా వైరస్‌ బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా సోకింది. అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో అలర్ట్‌ అయ్యారు.  ఇటీవల అమిత్‌షాను కలిశానని ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్తున్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడించారు.

'నేను నిన్న సాయంత్రం అమిత్‌షాను కలిశాను.  వైద్యుల సలహా మేరకు నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నాను.  కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటాను.  మరికొన్ని రోజుల్లో కరోనా పరీక్షలు చేయించుకుంటాను.  కోవిడ్‌-19 రూల్స్‌, ప్రొటోకాల్స్‌ ప్రకారం ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి ఉండాలని' సుప్రియో ట్వీట్‌ చేశారు. 


logo