ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 19:16:33

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు.. 24న అద్వానీ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు.. 24న అద్వానీ స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు

లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ స్టేట్‌మెంట్‌ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనుంది. ఈ మేరకు మసీదు కూల్చివేత కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌ సోమవారం ప్రత్యేకంగా తేదీలను నిర్ణయించారు. సీఆర్పీ పీసీ సెక్షన్‌ 313 కిందట ఆయన స్టేట్‌మెంట్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 24న రికార్డు చేయనున్నారు. బీజేపీ నేత మురళీ మనోహ‌ర్ జోషి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసేందుకు 23న రికార్డు చేయనుంది. అలాగే 22న శివసేన మాజీ ఎంపీ సతీశ్‌ ప్రధాన్‌ నుంచి కూడా వీడియో లింక్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ తీసుకోనుంది.

గతేడాది జూలైలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ తొమ్మిది నెలల్లో పూర్తి కావాలని, అంటే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే మే8 న, ట్రయల్ కోర్టు తన తీర్పును ఆగస్టు 31 వరకు ప్రకటించడానికి గడువును పొడిగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి, కొత్త గడువును ఉల్లంఘించకుండా చూసుకోవాలని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్‌, సూర్యకాంత్‌ ద్విసభ్య ధర్మాసనం మే8న తెలిపింది. సాక్ష్యాల రికార్డింగ్‌ ఇంకా పూర్తి కానందున సమయం పొడగించాలని న్యాయమూర్తి మే6న సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. కాగా, కరోనా మహమ్మారి కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నారు. తమ నిర్దోషిత్వాన్ని కోరేందుకు వీలుగా సీఆర్ పీసీ సెక్షన్ 313 కింద కోర్టు వాంగ్మూలం తీసుకుంటున్నది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo