మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 03:00:16

ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను

ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను

  • ‘బాబ్రీ మసీదు’ తీర్పు రానున్న నేపథ్యంలో ఉమాభారతి వ్యాఖ్య

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు ఉమా భారతి చెప్పారు. ‘ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల ప్రారంభంలో లక్నోలోని సీబీఐ కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చాను. తీర్పు ఎలా వస్తుందన్న దాని గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ నన్ను ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను. నేను పుట్టిన ప్రదేశంలోని ప్రజలు కూడా సంతోషిస్తారు’ అని తెలిపారు. కాగా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారంటూ ఉమాభారతి, అద్వానీ, మురళీమనోహర్‌ జోషి తదితరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

అయోధ్యలో భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించిన ఆదిత్యనాథ్‌

అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరుగనున్న భూమి పూజ పనుల ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం పరిశీలించారు. వచ్చే నెల 5న భూమి పూజ జరుగనుంది.


logo