ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:16:44

'బాబ్రీ'‌ కేసు: సీబీఐ స్పెష‌ల్ కోర్టుకు అద్వానీ వాంగ్మూలం

'బాబ్రీ'‌ కేసు: సీబీఐ స్పెష‌ల్ కోర్టుకు అద్వానీ వాంగ్మూలం

న్యూఢిల్లీ: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసు విచార‌ణ‌ను ఆగ‌స్టు 31లోగా పూర్తిచేయాలంటూ సుప్రీంకోర్టు సూచించిన నేప‌థ్యంలో.. ఆ కేసులో నిందితులుగా ఉన్న 32 మంది నుంచి ల‌క్నోలోని సీబీఐ స్పెష‌ల్ కోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వాంగ్మూలాలు న‌మోదు చేస్తున్న‌ది. రోజుకు ఒక‌రి చొప్పున పిలిపించి వారి వాంగ్మూలాలు తీసుకుంటున్న‌ది. తాజాగా శుక్ర‌వారం బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు లాల్ కృష్ణ అద్వానీ వాంగ్మూలాన్ని సీబీఐ స్పెష‌ల్ కోర్టు న‌మోదుచేసింది. 

కాగా, గురువారం  బీజేపీ మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు ముర‌ళీమ‌నోహ‌ర్‌జోషి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం తీసుకున్న‌ది. ఈ సంద‌ర్భంగా తాను నిర్దోషిన‌ని, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్రపూరితంగా త‌న పేరును కేసులో ఇరికించింద‌ని జోషి ఆరోపించారు. అంతేగాక ఈ కేసులో సాక్ష్యులుగా ఉన్న‌వారంతా దొంగ సాక్ష్యులేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంత‌కుముదు మ‌రో నాయ‌కురాలు ఉమాభార‌తి కూడా సీబీఐ స్పెష‌ల్ కోర్టు ముందు ఇదే వాద‌న వినిపించారు.            

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo