శుక్రవారం 05 జూన్ 2020
National - May 18, 2020 , 17:24:03

కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు: బబితాపోగట్

కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు: బబితాపోగట్

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ 4.0 కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడాప్రాంగణాలు, స్టేడియాలకు మినహాయింపు ఇస్తున్నట్లు  కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లాక్ డౌన్ తో ప్రాక్టీస్ కు దూరమైన క్రీడాకారులకు సడలింపు ఇవ్వడం పట్ల కేంద్రప్రభుత్వానికి, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు రెజ్లర్ బబితా పోగట్ ధన్యవాదాలు తెలిపారు. ఒలంపిక్స్ క్రీడల కోసం సన్నద్దన్నమయే క్రీడాకారులకు ప్రాక్టీస్ కోసం అనుమతివ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo