సోమవారం 25 జనవరి 2021
National - Dec 30, 2020 , 16:31:47

రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్‌కు గాయాలు

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌కు గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మధోపుర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయనకు స్వల్పగాయాలైనట్లు తెలుస్తున్నది.కోటా మెగా హైవేపై అజార్ కారు ఓవ‌ర్ ట‌ర్న్ అయ్యింది.  ఓవ‌ర్ ట‌ర్న్ కావ‌డం వ‌ల్ల కారు బోల్తా ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సుర్వాల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

త‌న కుటుంబంతో క‌లిసి ర‌ణ్‌తంబోర్‌కు అజార్ వెళ్తున్న‌ట్లు  ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలిసింది. టైరు పేల‌డం వ‌ల్ల అజారు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పిన‌ట్లు తెలుస్తోంది. రోడ్డు ప‌క్క‌న ఉన్న ధాబాలోకి కారు దూసుకువెళ్లింది.  ఈ ప్ర‌మాదంలో అజార్ కుటుంబ‌స‌భ్యులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు.  ధాబాలో ప‌నిచేస్తున్న ఇషాన్ అనే వ్య‌క్తి గాయ‌ప‌డ్డాడు.  ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే క్రికెట‌ర్ అజార్ మ‌రో వాహ‌నంలో హోట‌ల్‌కు వెళ్లారు.  ఈ ఘ‌ట‌న ప‌ట్ల స్థానిక పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo