శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 16:02:29

అయోధ్య ఆల‌యం.. మూడేళ్లు.. 1100 కోట్ల ఖ‌ర్చు

అయోధ్య ఆల‌యం.. మూడేళ్లు.. 1100 కోట్ల ఖ‌ర్చు

ముంబై: అయోధ్య‌లో రామ మందిర నిర్మాణానికి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని, మొత్తం ఖ‌ర్చు రూ.1100 కోట్ల దాటుతుంద‌ని రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి వెల్ల‌డించారు. ప్ర‌ధాన ఆల‌యం మూడు నుంచి మూడున్న‌రేళ్ల‌లో పూర్త‌వుతుంది. దీనికి రూ.300-400 కోట్ల ఖ‌ర్చ‌వుతుంది. అయితే మొత్తం 70 ఎక‌రాల భూమిని అభివృద్ధి చేయ‌డానికి మాత్రం రూ.1100 కోట్లు అవుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ ఆల‌య నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిపుణుల‌తో మాట్లాడిన త‌ర్వాత ఇంత మొత్తం అవుతుంద‌ని తాను అంచ‌నా వేసిన‌ట్లు గోవింద్ దేవ్ గిరి తెలిపారు.

అయితే దీనిపై ట్ర‌స్ట్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. నిజానికి ఇప్ప‌టికే చాలా మంది కార్పొరేట్లు, సంపన్న కుటుంబాల వాళ్లు ఆల‌య డిజైన్లు ఇవ్వండి, తామే నిర్మిస్తామ‌ని చెప్పార‌ని.. అయితే తాము అందుకు అంగీక‌రించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. విరాళాల కోసం తాము 6.5 ల‌క్ష‌ల గ్రామాల‌కు, మొత్తం 15 కోట్ల ఇళ్ల‌కూ చేరుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. 

VIDEOS

logo