మంగళవారం 02 మార్చి 2021
National - Jan 26, 2021 , 17:12:49

అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..

అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..

లక్నో : అయోధ్యలో ఒకవైపు రామ మందిరం నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతుండగా.. మరోవైపు మసీదు నిర్మాణం పనులు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని మసీదుకు కేటాయించిన స్థలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మొక్కలు నాటి మసీదు నిర్మాణం పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ (ఐఐసీఎఫ్‌) ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగింది.

సుప్రీంకోర్టు 2019 లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మేరకు అయోధ్య నగరం శివారులోని దన్నీపూర్‌లో మసీదు నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో 5 ఎకరాల్లో మసీదును నిర్మించానున్నారు. దీంతోపాటు దవాఖాన, కమ్యూనిటీ కిచెన్‌, మ్యూజియం భవనాలను నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌ బోర్డు బ్లూప్రింట్‌ను ఇటీవలనే విడుదల చేసింది. ఒకేసారి రెండు వేల మంది ప్రార్థనలు చేసేలా మసీదు నిర్మాణం ఉండనున్నది. వాతావరణ మార్పులపై సందేశం ఇవ్వడానికి ఈ భవనాన్ని జీరో ఎనర్జీగా నిర్మించనున్నారు. మసీదుకు ఎలాంటి విద్యుత్ కనెక్షన్ ఉండకుండా.. అన్ని రకాల విద్యుత్ డిమాండ్లను సౌర ఫలకాల సాయంతో తీర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్‌ అహ్మద్‌ ఫారూఖీ.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడికి సమీపంలో ట్రస్ట్‌కు చెందిన 12 మంది సభ్యులు మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. ‘మొక్కలు నాటడంతో మసీదు నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించాం. అయితే, ఇక్కడ భూపరీక్షలు జరుపడంతోనే మసీదు నిర్మాణ పనులు మొదలయ్యాయని చెప్పవచ్చు. తమ నక్షాలకు ఫైజాబాద్‌ అధికారులు ఆమోదం తెలుపగానే నిర్మాణం పనులు మొదలవుతాయి. మసీదును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు విరాళాలు ఇచ్చి సహకరించాలి. దాతలు ముందుకురావాలి’ అని ఫరూఖీ చెప్పారు. ఈ మసీదుకు ఇంతవరకు ఏ పేరును కూడా నిర్ణయించలేనట్లుగా తెలుస్తున్నది. అయితే, దీనికి ఒక గొప్ప మహారాజు పేరును పెట్టడానికి ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. తొలి దశలో మసీదుతోపాటు దవాఖానను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశలో దవాఖాన పొడగింపు పనులు చేపట్టి కమ్యూనిటీ కిచెన్‌ను కూడా నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇవి కూడా చదవండి..

పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'

మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!

క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..

55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..

చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo