శనివారం 23 జనవరి 2021
National - Dec 20, 2020 , 01:38:29

అయోధ్య మసీదు డిజైన్‌ ఇదే

అయోధ్య మసీదు డిజైన్‌ ఇదే

లక్నో: అయోధ్య శివారులోని ధన్నీపూర్‌ గ్రామం లో నిర్మించనున్న మసీదు డిజైన్‌తో పాటు అదే ఆవరణలో నిర్మించే దవాఖాన డిజైన్‌ను శనివారం ఆవిష్కరించారు. మసీదును గుడ్డు ఆకారంలో నిర్మిస్తారు. సౌర విద్యుత్తు ఏర్పాటు చేస్తారు. ఏకకాలంలో 2,000 మంది నమాజు చేయవచ్చు. మరోవైపు, 200 పడకల ఐదు అంతస్తుల దవాఖానా, సర్వమత భోజనశాల, అత్యాధునిక లైబ్రరీని కూడా నిర్మించనున్నారు.


logo