శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 18:15:32

అయోధ్య‌లో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

అయోధ్య‌లో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు

లక్నో: రామ జన్మభూమి అయిన‌ అయోధ్యలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నెల క్రితం వర‌కు చదరపు గజం ధ‌ర‌ రూ.1000 నుంచి రూ.1500 ఉండగా.. ప్రస్తుతం రూ.2000 నుంచి రూ.3000 ప‌లుకుతున్న‌ది. ఎందుకంటే గ‌త నెల 5న‌ అయెధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం భూమిపూజ జ‌రిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ముఖ్య అతిథిగా హాజ‌రై శంకుస్థాప‌న చేశారు.‌ అప్పటి నుంచి అక్క‌డ భూమి ధ‌ర‌లు అమాంతం పెరుగుతున్నాయి. 

అంతేగాక‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ అయోధ్యను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నగరంలో పెద్ద ఎత్తున వసతులు సమకూరుస్తామని, త్రీ స్టార్ హోట‌ళ్ల‌తోపాటు ఎయిర్‌పోర్టును కూడా నిర్మిస్తామని చెప్పారు. ఇది కూడా అయోధ్య‌లో భూముల ధ‌ర‌లు పెరుగ‌డానికి కార‌ణ‌మైంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo