సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 10:06:51

అయోధ్యకు నేడు యూపీ సీఎం.. ఏర్పాట్ల పరిశీలన..

అయోధ్యకు నేడు యూపీ సీఎం.. ఏర్పాట్ల పరిశీలన..

అయోధ్య : రామ జన్మభూమిలో ఆలయ భూమిపూజ పనులు జోరుగా సాగుతున్నాయి. కార్యక్రమం ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం పరిశీలించనున్నారు. ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీ రామ ఆలయానికి పునాది రాయి వేయనుండగా, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు వినయ్‌ కటియార్‌ మాట్లాడుతూ అయోధ్యలో ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారని, పనులన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని చెప్పారు. కాగా, ఇప్పటికే వేదికతో పాటు పలు ప్రాంతాలను మట్టి దీపాలు, రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. డెప్యూటీ సీఎం కేశవ ప్రసాద్‌ మౌర్యతో సహా ఉన్నతాధికారులంతా అయోధ్యను సందర్శించి, రోడ్ల వెడెల్పు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ను అమలులోకి తెచ్చినట్లు సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ‘ఒక స్థలంలో ఐదుగురు కంటే ఎక్కువ మందిని గుమిగూడవద్దని సూచించామని, ట్రాఫిక్‌ కదలికలను సులభతరం చేసేందుకు 12 ప్రదేశాల్లో రూట్‌ డైవర్షన్లను ప్లాన్‌ చేసినట్లు పేర్కొన్నారు. అయోధ్యకు చెందిన స్థానికుడు రమేశ్‌ మాట్లాడుతూ రామ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడం తమకు గర్వకారణమన్నారు. ‘ఇది మాకు చారిత్రాత్మక క్షణం, అలాగే నగరం అభివృద్ధికి ప్రభుత్వం అద్భుతమైన కృషి చేస్తోంది’ అని పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo