బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 20:30:17

శ్వాసే కాదు.. గుండెపై కరోనా ప్రభావం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

శ్వాసే కాదు.. గుండెపై కరోనా ప్రభావం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

న్యూఢిల్లీ : కొవిడ్‌ శ్వాసకోశ వ్యాధి మాత్రమే కాదని.. గుండెతో సహా అనేక ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ఈ విషయం ఓ అధ్యయనంలో వెలుగు చూసిందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘సండే సంవాద్‌’లో భాగంగా మాట్లాడారు. కరోనా వైరస్‌, సాధారణ ప్రజారోగ్యంపై ప్రభావం.. కేంద్రం కార్యాచరణ ప్రణాళికపై సోషల్‌ మీడియాలో ఓ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. కరోనాపై ఇటీవల వెలువడుతున్న అధ్యయనాలపై సమాచారం ఉందని, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికాకపోయినా.. ఇది ఊపిరితిత్తులపై మాత్రమే కాకుండా హృదయ, మూత్రపిండ వ్యవవస్థలను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు.

కొత్త ఆధారాల గురించి తమ దృష్టికి వచ్చిందన్నారు. ‘ఈ విషయాలను నిపుణుల కమిటీ ఒకటి అధ్యయనం చేస్తోంది. ఈ విషయాల్ని పరిశీలించాలని ఐసీఎంఆర్‌ వంటి సంస్థలకు కూడా సూచించాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే మతపరమైన ప్రదేశాల్లోనూ మాస్క్‌లు ధరించాలని, ‘దేవుడు మాస్క్‌లు ధరించడాన్ని నిషేధించడని’ అన్నారు. దేవాలయాలే కాదు ఏ రద్దీ ప్రదేశానికి వెళ్లినా మాస్క్‌ ధరించాలని, మార్గదర్శకాలు పాటించాలని కోరారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo