న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది జీ వెంకటేశ్రావుకు ప్రతిష్ఠాత్మక లెక్స్ ఫాల్కన్ అవార్డు లభించింది. దుబాయ్లో ఈ నెల 8న జరిగిన కార్యక్రమంలో ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. గత 34 ఏండ్లుగా ఆయన న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. లెక్స్ ఫాల్కన్ అవార్డ్డును ప్రపంచ న్యాయ రంగంలో విశిష్ట సేవలందించిన న్యాయవాదులకు ఇస్తుంటారు.