ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 21:30:05

‘ఏటీఎఫ్‌' ధర 16శాతం పెంపు

‘ఏటీఎఫ్‌' ధర 16శాతం పెంపు

న్యూఢిల్లీ : విమానయాన పరిశ్రమపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ఆ పరిశ్రమ లాక్‌డౌన్తో మరింత కుదేలైంది. మంగళవారం విమాన ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధర మరో 16శాతం పెరగడంతో సంస్థపై మరింత భారంపడే అవకాశముంది. ఈనెలలో వరుసగా ధరల పెంపు ఇది రెండోసారి. దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్‌ ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయర్‌ (ఏటీఎఫ్‌) ధర రూ.39,069గా ఉండగా కోల్‌కత్తాలో కిలోలీటర్‌కు రూ.44,024గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలోలీటర్‌ ఫ్యూయల్‌ ధర రూ.38,565గా ఉండగా చైన్నైలో రూ.40,239గా ఉంది.


logo