సోమవారం 25 జనవరి 2021
National - Nov 24, 2020 , 13:47:39

ఏఎఐ ఆధ్వర్యంలో ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్- 2020

 ఏఎఐ ఆధ్వర్యంలో ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్- 2020

ఢిల్లీ : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఎఐ) ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్-2020ను ప్రారంభించింది. ఏఎఐ ఎఎఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ ఉత్సవాలు దేశంలోని అన్ని విమానాశ్ర‌యాల్లోనూ, ఎఎన్ ఎస్ ప్ర‌దేశాల‌లోనూ జరగనున్నాయి. తమ ప్రాంతాల‌లో భ‌ద్ర‌తా ప‌నితీరును వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షించేందుకు ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లు, ఎయిర్ పోర్ట్ డైర‌క్ట‌ర్లు సానుకూల‌త‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని ఎఎఐ చైర్మ‌న్ అర్వింద్ సింగ్ విజ్ఞ‌ప్తి చేశారు.

కోవిడ్‌-19 సం‌క్షోభ స‌మ‌యంలో విమానాలు ఎక్కువ‌గా న‌డ‌వ‌ని కార‌ణంగా విమానాశ్ర‌యాల‌లో ప‌శుప‌క్ష్యాదుల భ‌యం పెరిగింద‌ని అని సింగ్ అన్నారు. ట్రాఫిక్ ఎంత ఉన్న‌ప్ప‌టికీ  భ‌ద్ర‌త నివార‌ణ చ‌ర్య‌ల‌ను నిరంత‌రం కొన‌సాగాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. విమాన‌యాన భ‌ద్ర‌త ప‌ట్ల అవ‌గాహ‌న‌ను పెంచేందుకు, ఎఎఐ విమానాశ్ర‌యాల‌లోనూ, ఎఎన్ ఎస్ స్టేష‌న్ల‌లో ఉద్యోగుల‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు ప్రత్యేక కార్య‌క్ర‌మాల‌ను, ప‌త్రాలు, సౌక‌ర్యాల స‌మీక్ష స‌హా వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్టు ఆయన చెప్పారు.

అంతేకాదు ఈ విష‌యంపై అవ‌గాహ‌న‌ను పెంచేందుకు వివిధ సామాజిక ప్ర‌చారాల‌ను ప్రారంభించ‌నున్నారు. ఎఎఐ కార్యాల‌యాలు, కార్య‌నిర్వ‌హ‌ణ కేంద్రాల వ‌ద్ద అంత‌ర్గ‌త‌, బ‌హిర్గ‌త భాగ‌స్వాముల‌కు భ‌ద్ర‌తా అవ‌గాహ‌న‌ వారం ప్రాముఖ్య‌తను తెలియ‌చెప్పేందుకు బ్యాన‌ర్లు, పోస్ట‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo