ఆదివారం 24 జనవరి 2021
National - Jan 13, 2021 , 16:02:13

రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో పక్షులు మృతి

రాజస్థాన్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వందల సంఖ్యలో పక్షులు మృతి

జైపూర్‌ :  రాజస్థాన్‌లో బర్డ్‌ప్లూ  కలకలం రేపింది. మంగళవారం ఒకే రోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో దాదాపు 626 పక్షులు మరణించాయని పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. పక్షుల మృతికి ఏవియన్‌ ఫ్లూనే కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే 349 కాకులు, 52 పావురాలు, 22 నెమళ్లు, 203 ఇతర పక్షులు మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పశుసంవర్థక శాఖ నివేదించింది. గతేడాది డిసెంబర్‌ 25 నుంచి ఇప్పటివరకు 3,947 పక్షులు మృత్యువాతపడ్డాయని వెల్లడించింది. అత్యధిక మరణాలు జైపూర్‌లోనే సంభవించాయని తెలిపింది. ఉదయ్‌పూర్‌లో ఇప్పటివరకు అనుమానాస్పద ఘటనలేవి నమోదు కాలేదని పేర్కొంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo