ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 01:52:49

ఖర్చు రూ.3,400..వసూలు రూ.600 : శ్రామిక్‌రైళ్ల వ్యయంపై రైల్వే

ఖర్చు రూ.3,400..వసూలు రూ.600 : శ్రామిక్‌రైళ్ల వ్యయంపై రైల్వే

న్యూఢిల్లీ: వలస కూలీలను స్వస్థలాలకు తరలించడానికి 4,450 శ్రామిక్‌ రైళ్లను నడిపామని, చార్జీ రూ.600 చొప్పున వసూలు చేశామని భారతీయ రైల్వే సోమవారం తెలిపింది. ఒక్కో ప్రయాణికుడిపై రూ.3,400 ఖర్చుతో సంస్థకు రూ.2,040 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఇప్పటివరకు 60 లక్షల మందిని తరలించామని, ఒక్కో రైలుకు రూ.75-80 లక్షలు ఖర్చయిందని వెల్లడించింది.


logo