శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 15:32:04

పానీపూరి తయారీ యంత్రాన్ని చూశారా..? వీడియో వైరల్‌!

పానీపూరి తయారీ యంత్రాన్ని చూశారా..? వీడియో వైరల్‌!

న్యూ ఢిల్లీ : కేక్‌ తయారు చేసే యంత్రాలు చూశాం.. అంతెందుకు ఐస్‌క్రీం తయారు చేసే యంత్రాలూ ఉన్నాయి. మరీ భారతదేశంలో పానీపూరి తయారు చేసే యంత్రాలను ఎప్పుడైనా  చూశారా.?

అస్సాంకు చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హార్ది సింగ్ అలాంటి యంత్రాన్నే తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. "ఇప్పుడు ఇది నిజమైన భారతీయ చాతుర్యం! పానీ పూరి విక్రయ యంత్రం. గోల్ గప్పే, పుచ్కా, బటాసా అని దీన్ని పిలవండి. మేము దీన్ని ఇష్టపడుతున్నాం’ అని ట్వీట్‌ చేస్తూ పానీపూరి తయారు చేసే యంత్రం వీడియోను షేర్‌ చేశారు. 

దీన్ని ‘ఆటో పానీ పూరి సెంటర్’గా పిలుస్తారు. ఈ యంత్రం ఏటీఎంతో సమానంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టిందని తయారీదారుడు వివరించాడు. 

అతను యంత్రం ఎలా పనిచేస్తుందో వీడియోలో చూపిస్తాడు. యంత్రంలో మనం పానీపూరి రకాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. వీడియోలో చూపిన విధంగా వ్యక్తి రూ.20 నోటును మిషన్‌లో పెడతాడు. వెంటనే పానీపూరి తయారై వస్తుంటుంది. ఒకటి తీసుకున్న తరువాత మరోటి వస్తుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పానీపూరి ప్రియులకు ఈ యంత్రం బాగా నచ్చుతుందని,  వినియోగదారుడు తప్పితే మరెవరూ ముట్టుకోకుండా యంత్రమే పానీపూరి తయారు చేసి ఇస్తుందని వ్యక్తి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo