బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 11:07:28

విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్‌

అనంతపురం : పెద్దవడుగూరు మండలం గుత్తిఅనంతపురంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్‌ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా ఆటో డ్రైవర్‌.. ఆ అమ్మాయి వెంట పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


logo