మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 11:51:44

91 ఏండ్ల వ‌య‌సులో ఆన్‌లైన్ క్లాస్‌.. గ్రేట్ స‌ర్‌!

91 ఏండ్ల వ‌య‌సులో ఆన్‌లైన్ క్లాస్‌.. గ్రేట్ స‌ర్‌!

91 ఏండ్ల ప్రొఫెస‌ర్ ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ ఫోటో చూస్తే ఆయ‌న‌కు స‌లాం కొట్టాల‌నిపిస్తుంది. ప్యాష‌న్ అనేది ఇలానే ఉంటుందేమో. టీచింగ్‌ను వృత్తిలా భావిస్తే రిటైర్ అవ్వ‌గానే వ‌దిలేస్తారు. ప్యాష‌న్ క‌దా! ప్రాణం పోయేంత‌వ‌ర‌కు చేయాల‌నిపిస్తూనే ఉంటుంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా స్కూళ్లు మూత‌బ‌డ‌టంతో వ‌ర్చువ‌ల్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. 

ఇత‌ను సెయింట్ థామ‌స్ విశ్వ‌విద్యాల‌యంలో 50 ఏండ్ల నుంచి ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు. ఇత‌ను ఐర‌న్ దుస్తులు, షూస్ వేసుకొని ఒక బాస్‌లా వ‌ర్చువ‌ల్ బోధ‌న‌ను స్వీక‌రిస్తున్నాడు. ఎన్నో ద‌శాబ్దాల నుంచి బోధిస్తున్న‌ప్ప‌టికీ వృత్తి మీద అభిరుచి ఉత్సాహం మాత్రం మొద‌టిసారిలా ఉంటుంది అత‌నికి. ఇత‌ని క్లాసులు వినే పిల్ల‌లు ఎంత అదృష్ట‌వంతులో అంటూ ప్రొఫెస‌ర్ కూతురు జులియా ఫేస్‌బుక్‌లో ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను 62 వేల‌కు పైగానే లైక్ చేశారు. అంతేకాదు 23 వేల‌మంది షేర్ చేశారు. ఇత‌ని క్లాస్‌కోసం నెటిజ‌న్లు కూడా ఎదురుచూస్తున్నారు. 


logo