సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 09:00:49

ఆగ‌స్టు 5... చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది: బాబా రామ్‌దేవ్‌‌

ఆగ‌స్టు 5... చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది: బాబా రామ్‌దేవ్‌‌

అయోధ్య: ‌శ్రీరాముని ఆల‌య నిర్మాణానికి భూమిపూజ జ‌రుగుతున్న ఈరోజు చారిత్ర‌క‌ దినం అని యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. ఆగ‌స్టు 5 చ‌రిత్ర‌లో చాలాకాలం గుర్తుండిపోతుంద‌ని చెప్పారు. రామాల‌య నిర్మాణంతో దేశంలో రామ‌రాజ్య స్థాప‌న జ‌రుగుతుంద‌ని తాను న‌మ్ముతున్నాని వెల్ల‌డించారు. రామాల‌య భూమిపూజ వేడుకల్లో బాబా రామ్‌దేవ్‌ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆయ‌న‌ ప్ర‌ముఖ దేవాల‌యం హనుమాన్ గ‌ర్హీ ఆల‌యంలో జ‌రిగిన‌ పూజ‌ల్లో పాల్గొన్నారు.  

భూమి పూజ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ కూడా హాజరుకా‌నున్నారు. ఇందులో భాగంగా హ‌నుమాన్ గ‌ర్హీ దేవాల‌యంలో ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. దీంతో ఆల‌య ప‌రిస‌రాల్లో భారీ భ‌ద్ర‌త ఏర్పాటుచేశారు. హ‌నుమాన్ ఆల‌యాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. 


logo