సోమవారం 18 జనవరి 2021
National - Nov 30, 2020 , 15:19:21

రాజ్య‌స‌భ‌లో ర‌భ‌స‌.. ఆ 20 నిమిషాలు ఆడియో లేదు

రాజ్య‌స‌భ‌లో ర‌భ‌స‌.. ఆ 20 నిమిషాలు ఆడియో లేదు

హైద‌రాబాద్‌:  వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మూడు కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు ఆమోదం ద‌క్కిన విష‌యం తెలిసిందే. అయితే రాజ్య‌స‌భ‌లో ఆ బిల్లుల‌ను ఆమోదింప చేసిన స‌మ‌యంలో ర‌భ‌స నెల‌కొన్న‌ది.  తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్యే ఆ రోజున రాజ్య‌స‌భ‌లో ఆ బిల్లులు పాస్ అయ్యాయి.  బిల్లుల‌ను అడ్డుకునేంద‌కు విప‌క్ష స‌భ్యులో డిప్యూటీ చైర్మ‌న్ వ‌ద్ద‌కు దూసుకెళ్లారు. అయితే ఆ ఘ‌ట‌న‌కు సంబంధించి సెంట్ర‌ల్ ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ ఇవాళ క్లారిటీ ఇచ్చింది.  బిల్లుల‌ను ఆమోదింపే చేసే స‌మ‌యంలో సుమారు 20 నిమిషాల పాటు ఆడియో ఫీడ్ దెబ్బ‌తిన్న‌‌ట్లు సీపీడ‌బ్ల్యూడీ పేర్కొన్న‌ది.   

బిల్లును పాస్ చేసిన రోజున మ‌ధ్యాహ్నం ఒంటి గంట అయిదు నిమిషాల నుంచి ఒక‌టి 35 నిమిషాల వ‌ర‌కు రాజ్య‌స‌భ‌లో ఉన్న మైక్‌లు అన్నీ బంద్ అయ్యాయ‌ని, కేవ‌లం చైర్మ‌న్ వ‌ద్ద ఉన్న మైక్ మాత్ర‌మే ఆన్‌లో ఉంద‌ని, కానీ స‌భ్యులు చైర్‌పై దాడి చేయ‌డం వ‌ల్ల ఆ మైక్ కూడా స‌రిగా ప‌నిచేయ‌లేద‌ని సీపీడ‌బ్ల్యూడీ వెల్ల‌డించింది. చైర్మ‌న్ సీటు వ‌ద్ద ఉన్న మైక్‌ను ఎంపీలు లాగేయ‌డం వ‌ల్ల మైక్రోఫోన్లు దెబ్బ‌తిన్న‌ట్లు సీపీడ‌బ్ల్యూడీ చెప్పింది.  డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ చైర్‌లో ఉన్న స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు సిపీడ‌బ్ల్య‌డీ ఆరోపించింది.  చైర్ మైక్ నుంచి రావాల్సిన ఆడియో ఔట్‌పుట్‌.. రాజ్య‌స‌భ టీవీకి స‌రిగా చేర‌లేద‌ని, అయితే సుమారు అర‌గంట త‌ర్వాత మ‌ళ్లీ మైక్‌లు ప‌నిచేసిన‌ట్లు సీపీడ‌బ్ల్య‌డీ తెలిపింది.