టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని అంతా అంటుంటారు. సినిమాలతో అభిమానులను అలరిస్తూనే…అభిమానులు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ ముందుకొస్తారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ సామాజిక సేవలో తమవంతు బాధ్యతగా పాలు పంచుకుంటూనే ఉన్నారు. బాలకృష్ణ లెజెండ్ లుక్ వెనుకున్న హెయిర్‌స్టైలిష్ట్ బెల్లరి బాలయ్య.
దురదృష్టవశాత్తు ఏప్రిల్ 26న బెల్లరి బాలయ్య అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ..తన అభిమాని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బెల్లరి బాలయ్యకు కుమారుడు, కూతుళ్లున్నారు. వారి యోగక్షేమాలు, ఇతర ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బాలయ్య కుటుంబానికి నందమూరి అభిమానులు అన్ని రకాలుగా అండగా ఉంటారని హామీనిచ్చారు. బాలకృష్ణ తన అభిమాని కుటుంబానికి కాల్ చేసిన ఓ ఆడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి..
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?