మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 17:44:24

లాక్‌డౌన్‌లో మైనర్‌ బాలికలకు వివాహ యత్నం

లాక్‌డౌన్‌లో మైనర్‌ బాలికలకు వివాహ యత్నం

నోయిడా : లాక్‌డౌన్‌ సమయంలో తన ఇద్దరు మైనర్ కూతుళ్లకు వివాహం యత్నం చేసిన ఘటన నోయిడా నగరంలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరానికి చందిన ఓ తండ్రి 12, 16 ఏళ్ల వయసుగల ఇద్దరు మైనర్ కూతుళ్లకు వివాహం చేసేందుకు ప్రయత్నించారు. కూలీ పని చేస్తు జీవనం సాగించే ఓ వ్యక్తి కరోనా ప్రభావంతో పనులు దొరక్క అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అతనికి ఇద్దరు మైనర్‌ కూతుళ్లున్నారు.లాక్‌డౌన్ సమయంలో ఖర్చును ఆదా చేసేందుకు తన ఇద్దరు కూతుళ్లను హర్యానాలోని పాల్వాల్‌కు చెందిన ఇద్దరు యువకులకు ఇచ్చి వివాహం చేసేందుకు యత్నించాడు.

ఇది గమనించిన ఇరుగు పొరుగు వారు చైల్డ్‌ హెల్పలైన్ అధికారులకు ఫిర్యాచు చేశారు. దీంతో వారు వచ్చి వివాహాన్ని నిలిపివేశారు. ఇద్దరు కూతుళ్ల తండ్రికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికలకు 18 ఏళ్ల వయసు నిండే వరకూ పెళ్లి చేయనని అంగీకార పత్రాన్ని రాయించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo