శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:03:57

దూబే స‌న్నిహితుడు గ‌డ్డ‌న్ త్రివేది అరెస్ట్‌

దూబే స‌న్నిహితుడు గ‌డ్డ‌న్ త్రివేది అరెస్ట్‌

ల‌క్నో: కాన్పూర్‌కు చెందిన గ‌్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేకు స‌న్నిహితుడైన అర్వింద్ అలియాస్ గ‌డ్డ‌న్ రాంవిలాస్ త్రివేది అరెస్ట‌య్యాడు. ముంబైలోని జుహు యూనిట్‌కు చెందిన యాంటీ టెర్ర‌రిజ‌మ్ స్క్వాడ్ థానేలో గ‌డ్డ‌న్ త్రివేదిని అదుపులోకి తీసుకుంది. గ‌డ్డ‌న్ రాంవిలాస్ త్రివేదితోపాటు అత‌ని డ్రైవ‌ర్ సోనూ తివారీని కూడా యాంటీ టెర్ర‌రిజ‌మ్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. జూలై 2న కాన్పూర్‌లో వికాస్ దూబేను అరెస్ట్ చేసేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై అత‌ని గ్యాంగ్ కాల్పులు జ‌రిపింది.

ఆ కాల్పుల్లో ఎనిమిది పోలీసులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. అనంత‌రం వికాస్ దూబే గ్యాంగ్ ప‌రార‌య్యింది. అప్ప‌టి నుంచి ఆ గ్యాంగ్ కోసం ముమ్మ‌రంగా గాలింపులు చేప‌ట్టిన పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు వికాస్ దూబే స‌హా ముగ్గురు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగిన‌ ఎదురుకాల్పుల్లో హ‌త‌మార్చారు. మ‌రో న‌లుగురు గ్యాంగ్ స‌భ్యులను ప్రాణాల‌తో ప‌ట్టుకుని ఎంక్వ‌యిరీ చేస్తున్నారు. ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo