అహ్మదాబాద్: గుజరాత్లోని వడోదరకు చెందిన అథర్వ అమిత్ మూలే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 17 ఏళ్ల ఆ కుర్రాడు.. సుమారు 91 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అతను పురస్కారం కూడా అందుకున్నాడు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, ఖతార్, సిరియా, యమెన్, న్యూజిలాండ్ లాంటి దేశాల జాతీయ గీతాలను కూడా అథర్వ అమిత్ మూలే చాలా అలవోకగా ఆలపిస్తున్నారు. వసుదైక కుటుంబం అన్న విశ్వాసాలను మనం నమ్ముతామని, అందు కోసమే ఇతర దేశాలకు చెందిన జాతీయ గీతాలను నేర్చుకోవాలన్న పట్టుదల తనలో కలిగినట్లు అతను చెప్పాడు. కేవలం ఇతర దేశాల గీతాలను పాడడమే కాదు.. వాటి అర్ధాలను కూడా అతను విడమరిచి చెప్పగలడు.