శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 06:46:29

క్యాండిళ్ల ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి

క్యాండిళ్ల ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా మోదీ నగర్‌లో ఉన్న ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మోదీనగర్‌ పరిధిలోని బాఖ్వ్రా గ్రామంలో ‘బర్త్‌డే’ క్యాండిళ్ల తయారీ కంపెనీలో ఆదివారం సంభవించిన పేలుడులో ఆరుగురు మహిళలు, 16 ఏండ్ల బాబుతోపాటు ఎనిమిదిమంది మృతిచెందారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్‌ పోస్ట్‌ ఇన్‌చార్జిని అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ ఫ్యాక్టరీకి అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయం తెలియరాలేదు. బర్త్‌డే కేకుల్లో పేలుడు పదార్థాలు వాడుతున్నందువల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. 

అగ్నిప్రమాద మృతులకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి ఒక్కక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.


logo