శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 18, 2020 , 10:04:04

యూపీలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

యూపీలో ఘోర ప్రమాదం : నలుగురు మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు - బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo