శనివారం 29 ఫిబ్రవరి 2020
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Feb 14, 2020 , 02:49:52
PRINT
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
  • 14 మంది మృతి, 25 మందికి గాయాలు
  • ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు

ఫిరోజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది చనిపోగా 25 మందికిగాయాలయ్యాయి. 50 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ఉత్తర బీహార్‌లోని మోతిహరికి బయల్దేరిన ఓ డబుల్‌ డెక్కర్‌ బస్సు ఆగ్రా- లక్నో ఎక్స్‌ప్రెస్‌ హైవేపై నిలిచి ఉన్న ఓ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 25 మందిని స్థానిక దవాఖానల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సీనియర్‌ ఎస్పీ సచ్ఛీంద్ర పటేల్‌ తెలిపారు. నాగ్లా ఖానాగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు రూరల్‌ ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన లారీ క్లీనర్‌ మాట్లాడుతూ.. ‘టైరు పంక్చరైందని, మరో టైరును మార్చేందుకు లారీని రోడ్డు పక్కన నిలిపాం. ఇంతలో ఓ బస్సు వచ్చి లారీని ఢీకొట్టింది. దీంతో నా సహచరులతో పాటు లారీ డ్రైవర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు’ అని చెప్పాడు. 
logo