సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 17:03:59

ఖ‌డ్గమృగాన్ని కాల్చిచంపిన వేట‌గాళ్లు!

ఖ‌డ్గమృగాన్ని కాల్చిచంపిన వేట‌గాళ్లు!

గువాహ‌టి: అసోంలో దారుణం జ‌రిగింది. కొమ్ము కోసం వేట‌గాళ్లు ఒక ఖ‌డ్గ‌మృగాన్ని కాల్చిచంపారు. శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో గాబ్రాయ్ యాంటీ పోచింగ్ క్యాంప్ ప‌రిధిలో ఖ‌డ్గ‌మృగం క‌ళేబ‌రాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న అట‌వీ అధికారులు పంచేనామా నిర్వ‌హించారు. ఖ‌డ్గ‌మృగం శ‌రీరంపై తుపాకీతో కాల్చిన గాయాల‌ను గుర్తించారు. ఇది క‌చ్చితంగా వేట‌గాళ్ల ప‌నేన‌ని అధికారులు నిర్ధారించారు. వేట‌గాళ్లు ఖ‌డ్డ‌మృగాన్ని చంపి దాని కొమ్మును న‌రికి తీసుకెళ్లార‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామ‌ని క‌జిరంగా నేష‌న‌ల్ పార్కు అధికారులు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo