బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 12:21:52

93 ఏళ్ల వృద్ధుడు కరోనాను ఎలా జయించగలిగాడు?

93 ఏళ్ల వృద్ధుడు కరోనాను ఎలా జయించగలిగాడు?

తిరువనంతపురం : ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్‌ను కేరళకు చెందిన వృద్ధ దంపతులు జయించిన విషయం విదితమే. కరోనా మహమ్మారి నుంచి ఆ ఇద్దరు దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. 93 ఏళ్ల వృద్ధుడు, ఆయన భార్య 88 ఏళ్ల మరియమ్మ.. ఈ వ్యాధి బారి నుంచి ఎలా బయటపడిగలిగారు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. 

పత్తనంతిట్ట జిల్లాకు చెందిన థామస్‌ అబ్రహం(93), మరియమ్మ(88) దంపతులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరి కుమారుడు, కోడలు, మనవడు గత నెలలో ఇటలీ నుంచి కేరళకు వచ్చారు. ఈ ముగ్గురి నుంచి అబ్రహం, మరియమ్మకు కరోనా సోకింది. దీంతో వీరిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. మొత్తానికి కరోనా నుంచి వృద్ధ దంపతులు కోలుకున్నారు.

ఈ సందర్భంగా అబ్రహం మనువడు రిజో మోన్సీ మాట్లాడుతూ.. మా తాత సాధారణ రైతు. తాత ఆరోగ్య సూత్రాలే ఈనాడు కరోనా నుంచి బయటపడగలిగేలా చేశాయి. తాత పూర్తిగా మద్యానికి, ధూమపానానికి దూరం. జిమ్‌కు వెళ్లడు కానీ, తాతకు సిక్స్‌ ప్యాక్‌ ఉంది. కేరళ వంటకమైన పజహన్‌కంజీ అంటే తాతకు ఎంతో ఇష్టం. టాపియోకా లేదా జాక్‌ఫ్రూట్‌ స్నాక్స్‌ బాగా ఇష్టపడుతారు. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఇదే ఫుడ్‌ తినేవారు. వృద్ధులకు ఈ వైరస్‌ ప్రాణాంతకమైనప్పటికీ.. వారు తినే ఫుడ్‌తోనే కరోనాపై విజయం సాధించారు అని రిజో చెప్పారు. ఈ వృద్ధ దంపతులు కరోనా నుంచి కోలుకోవడాన్ని చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. అబ్రహం, మరియమ్మ దంపతులకు ముగ్గుర సంతానం. ఏడుగురు మనవళ్లు, మనుమరాండ్లు కాగా, 14 మంది ముని మనవండ్లు, మనుమరాండ్లు ఉన్నారు.


logo