సోమవారం 18 జనవరి 2021
National - Dec 19, 2020 , 11:13:15

చ‌లిగుప్పిట్లో ఢిల్లీ

చ‌లిగుప్పిట్లో ఢిల్లీ

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో చలితీవ్రత పెరుగుతోంది. శనివారం ఉదయం ఉష్ణోగ్రతలు 3.9డిగ్రీలకు పడిపోయాయి.. సాధారణం కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారి ఒకరు తెలిపారు. హిమాలయాలు మంచుతో నిండి.. గాలులు ఢిల్లీ వైపు వీస్తుండడంతో లోధి రోడ్‌, అయానగర్‌లో 3.3, 3.4 డిగ్రీలకు పడిపోయాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం జాఫర్‌పూర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 2.7 సెల్సియస్‌కు డిపోయింది. గురువారం ‘తీవ్రమైన’ చల్లని రోజును నమోదు చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 15.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే ఏడు డిగ్రీలు, ఈ సీజన్‌లో ఇప్పటివరకు కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రత. కాగా, జాతీయ రాజధాని పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే ఐదు నుంచి ఆరు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుందని ఐఎండీ పేర్కొంది.