సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 12:28:32

ఢిల్లీలో 13.7 డిగ్రీలకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రత

ఢిల్లీలో 13.7 డిగ్రీలకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రత

న్యూఢిల్లీ : వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీపై ప్రకృతి చలి పంజా విసురుతోంది. మంగళవారం రాత్రి ఉష్ణోగ్రతలు 13.7డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గడిచిన 11 సంవత్సరాల్లో మంగళవారం రాత్రి నమోదైన 13.7 డిగ్రీలే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదైన రోజుగా నిలిచింది. సీజన్ సాధారణం కంటే నాలుగు డిగ్రీల కంటే తక్కువగా, గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ రికార్డుల ప్రకారం.. చివరిసారిగా 2009 అక్టోబర్‌ 26, 28 తేదీల్లో ఉష్ణోగ్రత 13.5 డిగ్రీలకు పడిపోయింది. పాలమ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17.1 డిగ్రీలు. ఇది సీజన్ సాధారణం కంటే తక్కువ. వాతావరణ అంచనా కేంద్రం అధికారి కుల్దీప్‌ శ్రీనివాస్తవ మాట్లాడుతూ.. మంగళవారం గాలి గంటకు 15-16 కిలోమీటర్ల వేగంతో వీచాయని తెలిపారు. ఉత్తర-పశ్చిమ దిశ నుంచి గాలుల తీవ్ర ఎక్కువగా ఉందని, ఉత్తర భాగం నుంచి వచ్చే గాలులు సాధారణంగా కనిష్ట ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని శ్రీవాస్తవ తెలిపారు. బుధవారం సైతం ఢిల్లీలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) అదేస్థాయిలో కొనసాగుతుందని, గురువారం నుంచి ఢిల్లీ మీదుగా గాలులు ఈశాన్య దిశకు మారే అవకాశం ఉందని శ్రీవాత్సవ తెలిపారు. దిశ మార్పుతో గాలి వేగం తగ్గి, నాణ్యత క్షీణిస్తుందని వివరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.