శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 01, 2021 , 11:21:43

15 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీలో ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు

15 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీలో ప‌డిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీని చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ద‌ట్ట‌మైన పొగ‌మంచు కూడా ఢిల్లీ న‌గ‌రాన్ని క‌మ్మేసింది. దీంతో న్యూఇయ‌ర్ రోజున ఢిల్లీలో క‌నిష్ట స్థాయికి ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. సరిగ్గా 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఢిల్లీలో 1.1 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయిన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 2006, జ‌న‌వ‌రి 8వ తేదీన 0.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. గ‌తేడాది జ‌న‌వ‌రిలో అత్య‌ల్పంగా 2.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. ఇవాళ ఉద‌యం ఢిల్లీ వ్యాప్తంగా పొగ‌మంచు ద‌ట్టంగా క‌మ్మేసింది. దాంతో పాటు చ‌లి తీవ్ర‌త కూడా బాగా పెర‌గింది. సఫ్ద‌ర్‌జంగ్‌, పాలం ఏరియాల్లో ఉద‌యం 6 గంట‌లకు మీట‌ర్ దూరం కూడా క‌నిపించ‌లేదు. అంత‌గా పొగ‌మంచు క‌మ్ముకుంది. జ‌న‌వ‌రి 4 నుంచి 5వ తేదీ మ‌ధ్య‌లో 8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. 


logo