శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:12:21

క‌రోనా రోగుల‌తో హెల్త్ వ‌‌ర్క‌ర్ల ఫ్లాష్ మోబ్ : వీడియో వైర‌ల్‌

క‌రోనా రోగుల‌తో హెల్త్ వ‌‌ర్క‌ర్ల ఫ్లాష్ మోబ్ :  వీడియో వైర‌ల్‌

ఇత‌రుల‌కు క‌రోనా వ‌చ్చిందంటేనే మ‌న గుండెల్లో భ‌యం ప‌ట్టుకుంటుంది. అలాంటిది మ‌న‌కు వ‌స్తే.. ఆ భ‌యంతోనే స‌గం చ‌చ్చిపోతాం. ఐసోలేష‌న్‌, క్వారెంటైన్‌లో ఉన్న‌న్ని రోజులు కుటుంబం స‌భ్యులు గుర్తుకువ‌చ్చి, వారిని క‌లుసుకోలేక‌పోతున్నామ‌ని ఒంట‌రిగా స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఆ స‌మ‌యంలో వారిలో ఎంతో స్ఫూర్తి నింపాలి. లేదంటే వారికి క‌రోనా పాజిటివ్ నుంచి నెగ‌టివ్‌కు రావాలంటే చాలా క‌ష్ట‌మే. అందుకే వారికి క‌రోనా సోకింద‌న్న విష‌యాన్నే మ‌ర్చిపోవాల‌ని ఈ వైద్య సిబ్బంది పాట‌లు, డ్యాన్సుల‌తో అల‌రిస్తున్నారు.

బళ్లారీ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్‌లో క్వారంటైన్‌లో ఉన్న కొంతమంది వైరస్ బాధితులు, హెల్త్ వర్కర్లు కలిసి.. ఫ్లాష్ మోబ్ ద్వారా మిగతా కోవిడ్-19 అనుమానితుల్లో ధైర్యాన్ని నింపాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేస్తూ కరోనా బాధితులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో అంద‌రూ ఫేస్‌మాస్క్ ధ‌రించి సామాజిక దూరం పాటిస్తూ డ్యాన్స్ చేసిన విధానంకు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు. దీనికి కొంత‌మంది వైద్య‌సిబ్బందిని అభినందించ‌గా, మ‌రికొంత‌మందేమో 'వారికి స‌రిగ్గా ట్రీట్‌మెంట్ ఇస్తే చాలు ఎలాంటి డ్యాన్స్‌లు అవ‌స‌రం లేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. logo