సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 20:49:26

అసుస్ నుంచి విపణిలోకి 4రకాల ల్యాప్‌టాప్‌లు

అసుస్ నుంచి విపణిలోకి 4రకాల ల్యాప్‌టాప్‌లు

బెంగళూరు: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ పీసీ అగ్రగామి సంస్థ అసుస్‌  నాలుగు రకాల ల్యాప్‌టాప్‌లను భారత్‌లో గురువారం విడుదల చేసింది.      వివోబుక్‌, జెన్‌బుక్ సిరీస్‌లో నూతన ల్యాప్‌టాప్‌లను వివోబుక్ అల్ట్రా కె14 (కె413), వివోబుక్ ఎస్‌14 (ఎస్‌433), జెన్‌బుక్ 13 (యూఎక్స్ 325), జెన్‌బుక్ 14 (యూఎక్స్‌425) వేరియెంట్లలో సదరు ల్యాప్‌టాప్‌లను విపణిలోకి ప్రవేశపెట్టింది. వీటిల్లో ఇంటెల్ కోర్ 10వ జనరేషన్ ప్రాసెసర్‌లను అందిస్తున్నారు. ఎస్‌14, కె14 ల్యాప్‌టాప్‌లు 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. ఎస్‌14లో ఇంటెల్ కోర్ ఐ7 10510యు ప్రాసెసర్‌ను, కె14 ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు.

వీటిల్లో 8జీబీ వరకు ర్యామ్‌కు, 512జీబీ వరకు ఎస్ఎస్‌డీకి సపోర్ట్‌ను అందిస్తున్నారు. జెన్‌బుక్ 13, 14 ల్యాప్‌టాప్‌లలో 13.3, 14 ఇంచుల డిస్‌ప్లేలు ఉంటాయి. ఇంటెల్ కోర్ ఐ7 10వ జనరేషన్ ప్రాసెసర్‌, 16జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అసుస్ వివోబుక్ అల్ట్రా కె14 (కె413) ల్యాప్‌టాప్‌ల ధర రూ.39,990 నుంచి ప్రారంభమవుతుంది. వివోబుక్ ఎస్‌14 (ఎస్‌433) ల్యాప్‌టాప్‌ల ధర రూ.67,990 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే జెన్‌బుక్ 13 (యూఎక్స్‌325), జెన్‌బుక్ 14 (యూఎక్స్‌425) ల్యాప్‌టాప్‌ల ధర రూ.79,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

అసుస్ జెన్‌బుక్ 13 (యూఎక్స్‌325)/14 (యూఎక్స్‌425) ఫీచర్లు…

-జెన్‌బుక్ 13 - 13.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

-జెన్‌బుక్ 14 - 14ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

-ఇంటెల్ 10వ జనరేషన్ 1 గిగాహెడ్జ్ కోర్ ఐ5-1035జి1 లేదా 1.3 గిగాహెడ్జ్ కోర్ ఐ7-1065జి7 ప్రాసెసర్

-8/16 జీబీ ర్యామ్ (డీడీఆర్‌4ఎక్స్‌), 1 టీబీ వరకు ఎస్ఎస్‌డీ

-విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం, యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎంఐ

- మైక్రో ఎస్‌డీ కార్డు రీడర్‌, హెచ్‌డీ వెబ్ కెమెరా, ఫేస్ రికగ్నిషన్ లాగిన్

-బ్లూటూత్ 5.0, 67 వాట్ అవర్ 4 సెల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్


అసుస్ వివోబుక్ అల్ట్రా కె14 (కె413) ప్రత్యేకతలు…

-14 ఇంచుల ఎల్ఈడీ బ్యాక్‌లిట్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

-ఇంటెల్ 10వ జనరేషన్ 1.6 గిగాహెడ్జ్‌ కోర్ ఐ5-10210యు లేదా 2.1 గిగాహెడ్జ్ కోర్ ఐ3-10110యు ప్రాసెసర్‌

-8జీబీ వరకు ర్యామ్ (డీడీఆర్‌4), 512జీబీ వరకు ఎస్ఎస్‌డీ

-విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం, యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎంఐ

-మైక్రోఎస్‌డీ కార్డు రీడర్‌, హెచ్‌డీ వెబ్ క్యామ్‌, ఫింగర్ ప్రింట్ స్కానర్‌, ఫేస్ రికగ్నిషన్ లాగిన్

-బ్లూటూత్ 5.0, 42వాట్ అవర్స్ 3 సెల్ బ్యాటరీ


అసుస్ వివోబుక్ ఎస్‌14 (ఎస్‌433) ఫీచర్స్…


-14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

-ఇంటెల్ 10వ జనరేషన్ 1.6 గిగాహెడ్జ్ కోర్ ఐ5-10210యు లేదా 1.8 గిగాహెడ్జ్ కోర్ ఐ7-10510యు ప్రాసెసర్‌

-8జీబీ వరకు ర్యామ్ (డీడీఆర్‌4), 512జీబీ వరకు ఎస్ఎస్‌డీ

-2జీబీ డీడీఆర్‌5 ఎన్‌వీడియా జిఫోర్స్ ఎంఎక్స్‌250 గ్రాఫిక్స్ కార్డ్

-విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం, యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎంఐ

-మైక్రోఎస్‌డీ కార్డు రీడర్‌, హెచ్‌డీ వెబ్ క్యామ్‌, ఫింగర్ ప్రింట్ స్కానర్‌, ఫేస్ రికగ్నిషన్ లాగిన్

-50 వాట్ అవర్స్ 3 సెల్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

logo