శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 18:17:38

ప్రధాని అయోధ్య పర్యటనను వ్యతిరేకించిన అస‌దుద్దీన్‌ ఓవైసీ

ప్రధాని అయోధ్య పర్యటనను వ్యతిరేకించిన అస‌దుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. అయోధ్యలో భూమి పూజ కార్యక్రమంలో మోడీ ప్రధాని హోదాలో పాల్గొనడం రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ మాట్లాడుతూ లౌకికవాదం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగం అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 5న అయోధ్యను సందర్శించనున్నారు. ఆయన రామ్ ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్ ఆలయ ఉద్యమంతో సంబంధం ఉన్న చాలా మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. అయితే కరోనా సంక్రమణ కారణంగా అయోధ్యలో అతిథుల సంఖ్య 200కు పరిమితం చేసినట్లు సమాచారం. 

ఈ సందర్భంగా మంగళవారం ట్విట్టర్‌ వేదికగా ప్రధాని పర్యటనను ప్రశ్నించారు. "భూమి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి అధికారికంగా పాల్గొననుండడం ఆయన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తుంది. లౌకికవాదం రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగం" అని రాసుకొచ్చారు. బాబ్రీ అయోధ్యలో 400 సంవత్సరాలకు పైగా ఉందని, 1992లో దీన్ని ఒక క్రిమినల్ మాబ్ కూల్చివేసిన ఘటనను తాము మర్చిపోలేమని ఆయన చెప్పారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo