బాహుబలి- ది బిగినింగ్ సినిమాలో ‘మనోహరి’ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ.. కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుండి ఉంటుంది. ఈ అమ్మడు తెలుగులో ‘టెంపర్, ‘కిక్2’, ‘లోఫర్’, ‘ఊపిరి’ చిత్రాల్లో ఐటమ్ నంబర్స్‌కు డ్యాన్స్‌లు చేసింది. హిందీలోను అదరగొడుతుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నోరా ఫతేహి అప్పుడప్పుడు తన డ్యాన్స్ మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వన్ డ్యాన్స్ అనే మ్యుజిషియన్ డ్రేక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇందులో పింక్ టాప్, బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించి నోరో తన బాడీని మెలికలుగా తిప్పుతూ డ్యాన్స్ చేసింది. సమ్మర్ టైం అంటూ నోరా చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మీరు ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.