గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 13, 2020 , 09:59:30

అసోంలో 69 వేలకు చేరిన కరోనా కేసులు

అసోంలో 69 వేలకు చేరిన కరోనా కేసులు

డిస్పూర్ :  అసోంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,593 మంది కరోనా బారినపడగా ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 69 వేలకు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంతా బిస్వాశర్మ తెలిపారు. 45,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 23,762 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని, 161 మంది మృతి చెందారని పేర్కొన్నారు. బుధవారం 1,43,109 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయగా 4,593 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అస్సాంలో 2,669 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 52,062 మందికి కోవిడ్‌ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.logo