శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 14:24:49

లాక్‌డౌన్‌ మరో రెండువారాలు పొడిగించాల్సిందిగా కేంద్రానికి లేఖ

లాక్‌డౌన్‌ మరో రెండువారాలు పొడిగించాల్సిందిగా కేంద్రానికి లేఖ

గౌహతి : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. కాగా కోవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ పిరియడ్‌ను మరో రెండు వారాలు పొడిగించాల్సిందిగా కోరుతూ అసోం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్‌ నేడు కేంద్రానికి లేఖ రాశారు. లాక్‌డౌన్‌పై అభిప్రాయాలు చెప్పాలిందిగా కేంద్రం రాష్ర్టాలకు నేటి వరకు గడువిచ్చింది. తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రానికి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు. గడిచిన 24 గంటల్లో గౌహతిలో కొత్తగా 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అసోంలో కేసుల సంఖ్య 87కు చేరింది. కోవిడ్‌-19 కారణంగా అసోంలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. 41 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 43 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేసుల దృష్ట్యా గౌహతిలోని తొమ్మిది ప్రాంతాలను కంటైన్మైంట్‌ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది.


logo