శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 09:24:13

అస్సాంలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు

అస్సాంలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు

హైద‌రాబాద్: అస్సాంలో ఇవాళ స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల గ‌త ఆరు నెల‌ల నుంచి విద్యా సంస్థలు బంద్ అయ్యాయి.  అయితే ఇవాళ్టి నుంచి మ‌ళ్లీ స్కూళ్ల‌ను, కాలేజీల‌ను తెరుస్తున్నారు.  కాలేజీ తెర‌వ‌డం ప‌ట్ల దిస్‌పూర్‌లో విద్యార్థులు సంతోషం వ్య‌క్తం చేశారు.  క్లాసుల‌కు హాజ‌రవుతున్న వేళ అన్ని కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌నున్న‌ట్లు విద్యార్థులు చెబుతున్నారు.  చంఢీఘ‌డ్‌లో కూడా 9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు క్లాసులు ప్రారంభం అయ్యాయి. టీచ‌ర్ల నుంచి గైడెన్స్ తీసుకునే విధంగా వారికి అవ‌కాశం క‌ల్పించారు. సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి 50 శాతం సిబ్బంది స్కూళ్ల‌కు హాజ‌రుకావాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. జ‌మ్మూలో కూడా కేంద్ర విద్యాల‌యం తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.  logo