బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 20:50:16

ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

ఉదల్‌గురి : అస్సాం రాష్ట్రంలోని బోడోలాండ్‌ ప్రాదేశిక ప్రాంతం జిల్లా (బీటీఏడీ)లో ఆదివారం ఉదల్‌గురి పోలీసులు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి పట్టుబడ్డాయి. తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించగా ఆయుధాలు కంటబడటంతో  స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు ఏకే47 రైఫిళ్లు, ఓ ఎం20 పిస్టల్‌, ఓ 9ఎంఎం పిస్టల్‌తోపాటు మ్యాగజైన్‌, మందుగుండు సామగ్రిని ఉన్నట్లు అస్సాం పోలీసులు తెలిపారు. logo