మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 23:09:15

అస్సాంలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రణాళికలు

అస్సాంలో సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రణాళికలు

గౌహతి : అస్సాంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తెరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమాంత బిస్వాశర్మ శనివారం తెలిపారు. దీనిపై తుది నిర్ణయం కేంద్రం తీసుకోనుందని ఆయన పేర్కొన్నారు. అస్సాంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరిచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఆగస్టు 23 నుంచి 30 వరకు ఉపాధ్యాయులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. 1 నుంచి 4వ తరగతి విద్యార్థులను పాఠశాలలకు అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు.logo